Mon Dec 23 2024 04:29:51 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పంలో ఉద్రిక్తత... చంద్రబాబు బస చేసిన?
కుప్పంలో ఉద్రిక్తత నెలకొంది. నిన్న చంద్రబాబు పర్యటనలో ఇరు వర్గాలురాళ్లతో దాడులు చేసుకున్నారు.
కుప్పంలో ఉద్రిక్తత నెలకొంది. నిన్న చంద్రబాబు పర్యటనలో ఇరు వర్గాలురాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో కొందరు టీడీపీ కార్యకర్తలు గాయాలపాలయ్యారు. దీనికి ప్రతిగా కుప్పంలోని వైసీీపీ నేత ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. దీనిని నిరసిస్తూ కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని వైసీపీ పిలుపునిచ్చింది. చంద్రబాబు బస చేసిన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు.
పోలీసుల బందోబస్తు..
టీడీపీ అధినేత చంద్రబాబు నిన్నటి నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో తొలి రోజే ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ జెండాలను టీడీపీ కార్యకర్తలు తొలగించడంతో మొదలయిన ఈ వివాదం చివరకు ఘర్షణలకు దారితీసింది. చంద్రబాబు ఈరోజు కూడా కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story