Mon Dec 23 2024 02:59:48 GMT+0000 (Coordinated Universal Time)
చేప దాడిలో మత్స్య కారుడు మృతి
చేపల వేటలో విషాదం చోటు చేసుకుంది. ముత్యాలమ్మపాలెంకు చెందిన ఐదుగురు మత్య్సకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు.
చేపల వేటలో విషాదం చోటు చేసుకుంది. వేటకు వెళ్లిన మత్స్యకారుడు పై చేప దాడి చేయడంతో మృతి చెందాడు. ముత్యాలమ్మ పాలెంకు చెందిన ఐదుగురు మత్స్య కారులు చేపల వేటకు వెళ్లారు. తీరం నుంచి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం వెళ్లారు. నిన్న బయలుదేరిన మత్స్యకారులు సముద్రంలో వలను విసిరారు. అయితే ఈరోజు ఉదయం వల బరువెక్కింది. వల బరువెక్కడంతో చేపలు భారీగా పడ్డాయని సంబర పడ్డారు.
బయటకు లాగేందుకు....
వల బయటకు లాగేందుకు ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. దీంతో మత్స్య కారుడు జోగన్న పడవ దిగి వలను తీయాలని ప్రయత్నించారు. ఈ సమయంలోనే పెద్ద చేప జోగన్న పై దాడికి దిగింది. చేప తన కొమ్ముతో జోగన్న ను గుద్దింది. బలమైన గాయాలు కావడంతో జోగన్న అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన మత్స్యకారులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు.
Next Story