Sun Dec 22 2024 23:24:58 GMT+0000 (Coordinated Universal Time)
జీతాల లొల్లి... తాము బిల్లులు చేయలేమంటూ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఉద్యోగుల మధ్య జీతాల చెల్లింపుల్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఉద్యోగుల మధ్య జీతాల చెల్లింపుల్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని ప్రభుత్వం అన్ని ట్రెజరీలకు ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు ఉద్యోగులు మాత్రం పాత జీతాలను చెల్లించాలంటూ రోడ్కెక్కారు. ఈ తరుణంలో ఏపీ డైరెక్టర్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్‌కు ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు చేయాలంటే సర్వీస్ రిజిస్టర్ లు కావాలని తెలిపారు.
ఎస్ఆర్ వెరిఫికేషన్ తర్వాతనే.....
సర్వీస్ రిజిస్టర్ ల వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఫిక్సేషన్ ఎలా జరిగిందో తెలుస్తుందని చెప్పారు. లేకపోతే ట్రెజరీ ఉద్యోగులు పే ఫిక్సేషన్ ఎలా చేయగలుగుతారని ప్రశ్నించారు. పేమెంట్ చేస్తే ట్రెజరీ ఉద్యోగులను బాధ్యలను చేస్తామని ప్రభుత్వం పీఆర్సీ జీవోలో చెప్పిందని, రెండు మూడు రోజుల్లో బిల్స్్ వెరిఫికేషన్ కష్టమని ఆ లేఖలో పేర్కొన్నారు. హడావిడిగా బిల్లులు చేయడం సాధ్యం కాదని తెలిపారు. ఈ ప్రాసెస్ కు కొంత సమయం పడుతుందని చెప్పారు. పొరపాట్లు జరిగితే ప్రజాధనం నష్టపోయే అవకాశముందని పేర్కొన్నారు. దీంతో ఈనెల జీతాలు ఉద్యోగులకు పడతాయా? లేదా? అన్నది సందేహంగా మారింది.
Next Story