Sat Mar 29 2025 14:34:44 GMT+0000 (Coordinated Universal Time)
కొలికపూడి విచారణలో ఏం జరిగిందంటే?
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇవాళ పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరై తనపై వివరణ ఇచ్చారు.

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇవాళ పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరై తనపై వివరణ ఇచ్చారు. విచారణ ముగిసిన తర్వాత టీడీపీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. మీరు పార్టీ గీత దాటుతున్నారు... మీ వ్యవహార శైలి సరిగా లేదు అని క్రమశిక్షణ కమిటీ కొలికపూడికి స్పష్టంగా చెప్పిందని వెల్లడించారు. కొలికపూడి ఏడు నెలల వ్యవధిలో రెండు ఘటనల్లో రెండు సార్లు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారని వర్ల రామయ్య తెలిపారు.
ఆ కుటుంబం వరసగా...
కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఇదే విషయాన్ని కొలికపూడికి కూడా చెప్పామని అన్నారు. త్వరలోనే కొలికిపూడిపై నివేదిక రూపొందించి సీఎం చంద్రబాబుకు సమర్పిస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఒకటేనని... కార్యకర్త అయినా, ఎమ్మెల్యే అయినా క్రమశిక్షణ పాటించాల్సిందేనని వర్లరామయ్య తెలిపారు. ఎమ్మెల్యే కొలికపూడి కూడా మీడియాతో మాట్లాడారు. ఆ కుటుంబం వరసగా టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతుందని, రహదారిని ఆక్రమించడంతోనే తాను హెచ్చరించానని, ప్రజల కోసమే తాను ఈ పనిచేసినట్లు కొలికపూడి తెలిపారు.
Next Story