Thu Dec 26 2024 22:44:15 GMT+0000 (Coordinated Universal Time)
జనసేన కు షాక్.. బీఆర్ఎస్లో చేరికలు
బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించనున్నారు. రేపు ఆయన కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు
బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించనున్నారు. రేపు తోట చంద్రశేఖర్ కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకోనున్నారు. అనంతరం ఆయనను బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రకటించే అవకాశాలున్నాయి. తోట చంద్రశేఖర్ ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు. ఆయన మాజీ ఐఏఎస్ అధికారి. గుంటూరు నుంచి భారీ ర్యాలీతో రేపు హైదరాబాద్ కు చేరుకోనున్న తోట చంద్రశేఖర్ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారని చెబుతున్నారు.
జనసేనకు షాక్..
జనసేన పార్టీలో ప్రస్తుతం తోట చంద్రభేఖర్ రాజకీయ వ్యవహరాల కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ చేరితే కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ ను బలోపేతం చేసే అవకాశముందని చెబుతున్నారు. ఆయనతో పాటు కొందరు కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ లో చేరనున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికే తోట చంద్రశేఖర్ పార్టీలో చేరుతున్నట్లు తెలిసింది.
Next Story