Mon Dec 23 2024 17:55:50 GMT+0000 (Coordinated Universal Time)
గచ్చిబౌలి స్టేడియంలో బాబుకు అండగా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ వేల సంఖ్యలో అభిమానులు గచ్చిబౌలి స్టేడియానికి తరలి వచ్చారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ వేల సంఖ్యలో అభిమానులు గచ్చిబౌలి స్టేడియానికి తరలి వచ్చారు. ఐటీ ఉద్యోగులు కుటంబ సమేతంగా రావడంతో గచ్చిబౌలి స్టేడియం పూర్తిగా నిండిపోయింది. సీబీఎన్ వెంటే తాము అంటూ నినాదాలతో స్టేడియం హోరెత్తింది. సైబర్ టవర్స్ నిర్మించి ఇరవై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంలో చంద్రబాబుకు కృతజ్ఞత తెలిపేందుకు సీబీఎన్ గ్రాటిట్యూడ్ పేరిట గచ్చి బౌలి స్టేడియంలో సంగీత విభావరిని ఏర్పాటు చేశారు.
అభిమానులతో...
దీంతో స్టేడియంలోని గ్యాలరీలన్నీ సీబీఎన్ అభిమానులతో నిండిపోయాయి. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ముక్త కంఠంతో ఖండించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. బెంగళూరుకు చెందిన బీ్ గురు బ్యాండ్ బృందం సంగీత విభావరి నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Next Story