Mon Nov 18 2024 02:48:54 GMT+0000 (Coordinated Universal Time)
పాక్ జైలు నుండి విడుదలైన ఏపీ మత్స్యకారులు
అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL)ను ఉల్లంఘించినందుకు పాకిస్తాన్ సముద్ర భద్రతా సంస్థ (PMSA) వారిని..
గతవారం (మే13) పాకిస్థాన్ జైలు నుంచి విడుదలైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మత్స్యకారులు గుజరాత్ నుండి నేడు విశాఖపట్నంకు చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మత్స్యకారులు సహా మొత్తం 198 మంది మత్స్యకారులను పాక్ అధికారులు మే 13న విడుదల చేశారు. వీరంతా మే15 వ తేదీ ఉదయం పంజాబ్ నుంచి రైలుమార్గంలో గుజరాత్ రాష్ట్రంలోని వడోదర చేరుకున్నారు.
విడుదలైన 198 మంది భారతీయ జాలర్లలో 184 మంది గుజరాత్‌కు చెందినవారు, ముగ్గురు ఆంధ్ర ప్రదేశ్‌కు చెందినవారు, నలుగురు డయ్యూకు చెందినవారు, ఐదుగురు మహారాష్ట్రకు చెందినవారు, మరో ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL)ను ఉల్లంఘించినందుకు పాకిస్తాన్ సముద్ర భద్రతా సంస్థ (PMSA) వారిని గుజరాత్ తీరం సమీపంలోని అరేబియా సముద్రంలో పట్టుకుంది. సరిహద్దు రేఖను ఉల్లంఘించిన నేరం కింద వారందరినీ జైలులో ఉంచింది. భారత ప్రభుత్వం చొరవతో మత్స్యకారులందరినీ విడుదల చేసింది. గుజరాత్ నుంచి ఏపీకి చెందిన ముగ్గురు మత్స్యకారులు నేడు విశాఖపట్నంకు చేరుకున్నారు. మత్స్యకారుల విడుదలతో వారి కుటుంబ సభ్యులు సంతోషించారు.
"కేంద్ర ప్రభుత్వ దౌత్య ప్రయత్నాలకు ధన్యవాదాలు. పాకిస్తాన్ జైళ్లలో ఉన్న ఈ మత్స్యకారులను మే 13 న పంజాబ్‌లోని వాఘా సరిహద్దులో విడుదల చేసి భారత అధికారులకు అప్పగించారు" అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story