Mon Dec 23 2024 14:24:36 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీశైలం మూడు గేట్లు ఎత్తివేత
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు వదిలారు
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు వదిలారు. నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం శ్రీశైలం లో 202 టీఎంసీల నీరు ఉంది. మూడు గేట్ల నుంచి దాదాపు 57, 751 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఇవి నేరుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటాయి. శ్రీశైలం నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.50 అడుగుల మేర నీరు చేరింది.
పది రోజుల్లో....
కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు చేరడంతో ఇప్పటికే ప్రాజెక్టుకు కుడి, ఎడమల వైపు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. నాగార్జున సాగర్ నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 538 అడుగుల మేర నీరు ఉంది. ఇదేరకమైన ప్రవాహం ఉంటే పది రోజుల్లో సాగర్ కూడా నిండే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏడాది ఆగస్టు నెలలో శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తారు. అయితే జులై నెలలోనే భారీ వర్షాలు కురియడంతో ముందుగానే గేట్లు ఎత్తివేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పాల్గొన్నారు.
Next Story