Sun Nov 24 2024 13:07:57 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఆమ్రాపాలికి చోటు లేదా? పోస్టింగ్ ఎప్పుడో?
తెలంగాణ నుంచి ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ అయి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లారు. ఆమ్రాపాలికి పోస్టింగ్ ఇవ్వలేదు
తెలంగాణ నుంచి ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ అయి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లారు. ఇటు న్యాయస్థానంలోనూ తమకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఐఏఎస్ అధికారులు ఆమ్రాపాలి, వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్ లు ఏపీకి వెళ్లిపోయారు. చీఫ్ సెక్రటరీకి రిపోర్టు చేశారు. అయితే ఇప్పటి వరకూ ఆమ్రాపాలికి ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. తొలుత పవన్ కల్యాణ్ పేషీలో ఆమెకు అవకాశం కల్పించనున్నట్లు వార్తలు వచ్చాయి కానీ, అది కూడా జరగలేదు.
వాకాటి కరుణను...
అయితే తాజాగా మరో ఐఏఎస్ అధికారి వాకాటి కరుణను రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ (సీఎఫ్డబ్ల్యూ)గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం సీఎఫ్డబ్ల్యూ ఇన్ఛార్జిగా ఉన్న డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సిరి స్థానంలో ఈమెను నియమించనున్నారని తెలిసింది. ఆమ్రాపాలికి మాత్రం ఇంత వరకూ పోస్టింగ్ ఇవ్వలేదు. ఆమె సేవలను ఎక్కడ ఉపయోగించుకోవాలన్న దానిపై ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తునట్లు తెలిసింది. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story