Mon Dec 23 2024 03:31:50 GMT+0000 (Coordinated Universal Time)
ఆడుకుంటూ మిస్సైన బాలుడు.. అంతా వెతుకగా చివరికి..
రాయదుర్గంలోని చంద్రబాబు కాలనీలో మంజునాథ్, సరిత దంపతులు నివశిస్తున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు జశ్వంత్ ఉన్నాడు. మంజునాథ్
ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడు ఉన్నట్లుండి మిస్సయ్యాడు. చుట్టుపక్కలంతా వెతికిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఇంతలో ఓ వ్యక్తి నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద ఉన్న నీటి సంపులో బాలుడి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటన గురువారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో వెలుగుచూసింది. చిన్నారిని విగతజీవిగా చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
రాయదుర్గంలోని చంద్రబాబు కాలనీలో మంజునాథ్, సరిత దంపతులు నివశిస్తున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు జశ్వంత్ ఉన్నాడు. మంజునాథ్ టైలర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం సాయంత్రం నుంచి జశ్వంత్ అదృశ్యమవ్వడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. గురువారం ఉదయం కాలనీలోని నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి యజమాని గోడలకు క్యూరింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు సంపులో చిన్నారి శవం కనిపించింది. దీంతో స్థానికులకు సమాచారం అందించగా తల్లిదండ్రులు స్థానికులు బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపి.. కేసు నమోదు చేసుకున్నారు.
Next Story