Mon Dec 23 2024 05:53:13 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి జూ లో పులిపిల్ల మృతి
పులిపిల్లలు తప్పిపోయినప్పటి నుండి వాటిని తల్లి పులి వద్దకు చేర్చేందుకు అధికారులు, సిబ్బంది విశ్వప్రయత్నాలు..
ఈ ఏడాది మార్చి 6వ తేదీన నల్లమల ఆత్మకూరులో తల్లి పులి నుంచి తప్పిపోయిన నాలుగు పులి కూనల్లో ఒకటి తిరుపతి జూ లో మరణించింది. పులిపిల్లలు తప్పిపోయినప్పటి నుండి వాటిని తల్లి పులి వద్దకు చేర్చేందుకు అధికారులు, సిబ్బంది విశ్వప్రయత్నాలు చేశారు కానీ.. తల్లిపులి జాడ తెలియలేదు. ఇక చేసేది లేక నాలుగు పులి పిల్లల్ని మార్చి 9న అటవీశాఖ అధికారులు తిరుపతి జూ పార్కుకు తరలించారు. జూ లో ఉన్న వెటర్నరీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏసీ గదిలో పులి పిల్లల్ని ఉంచి వాటి ఆలనా, పాలనా చూస్తున్నారు.
జూ కు వచ్చినప్పటి నుంచి నాలుగు పులి పిల్లల్లో మూడు యాక్టివ్ గా ఉండగా.. నాలుగో పిల్ల మాత్రం కాస్త బలహీనంగా ఉంది. అది చివరిగా పుట్టినది కావడంతో వీక్ గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తాజాగా ఆ పులిపిల్ల కిడ్నీ, శ్వాసకోశ సమస్యలతో మృతి చెందింది. తిరుపతి జూ లోకి వచ్చినప్పటి కంటే.. ప్రస్తుతానికి కాస్త బరువు పెరిగింది. అయినప్పటికీ అది అనారోగ్యంతో మరణించిందని జూ నిర్వాహకులు తెలిపారు. మరణించిన పులి పిల్ల శరీరం నుంచి పోస్టుమార్టం శాంపుల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపారు.
Next Story