Mon Nov 25 2024 13:41:02 GMT+0000 (Coordinated Universal Time)
క్యూ లైన్ బయటకు
తిరుమలలో నేడు రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు కావడం, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది
తిరుమలలో నేడు రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు కావడం, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. వైకుఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి బయట శిలా తోరణం వరకూ క్యూ లైన్ శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. నడక దారిన వచ్చిన భక్తులకు మాత్రం ఐదు గంటల్లో స్వామి వారి దర్శన సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వ దర్శనం క్యూ లైన్లో ప్రవేశించిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 70,366 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. వీరిలో 38,653 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.32 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ రద్దీ ఈ నెల మొత్తం కొనసాగుతుందని టీటీడీ అంచనా వేస్తుంది. అందుకే టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని కోరుతున్నారు.
Next Story