Sun Dec 22 2024 21:10:52 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలకు వెళ్లే భక్తులకు ముఖ్య సూచన
తిరుమల వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రత్మోత్సవాలకు ఈ రోజు అంకురార్పణ
తిరుమల వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రత్మోత్సవాలకు ఈ రోజు అంకురార్పణ జరగనుంది. అక్టోబర్ 15వ తేదీ 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈ రోజు రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. సాయంత్రం మాడవీధులలో ఉరేగనున్నారు శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు. రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనుండగా. రేపు ఉదయం బంగారు తిరుచ్చి పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. రేపు రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై ఊరేగనున్నారు శ్రీవారు.
ఇవాళ, రేపు తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు జారీచేసే టోకెన్లు రద్దు చేసింది టీటీడీ.. మరోవైపు.. ఇవాళ నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.
బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు లగేజి, సెల్ఫోన్లు భద్రపరచుకునేందుకు తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ ఎదురుగా అదనంగా లగేజి కౌంటర్లు ఏర్పాటు చేశారు. తిరుమలలో జిఎన్సి, టిబిసి, పిఏసి-4 వద్ద లగేజి కౌంటర్లు ఉన్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం, వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పిఏసి-4 లగేజి కౌంటరును తాత్కాలికంగా మూసి వేశారు. భక్తుల సౌకర్యార్థం వరాహస్వామి విశ్రాంతి గృహాలకు ఎదురుగా, కల్యాణవేదిక వెనుకవైపు గల శ్రీవారి సేవాసదన్ ఎదురుగా విశాలమైన ప్రాంతంలో అదనంగా 3 లగేజి కౌంటర్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం నుండి వెలుపలికి వచ్చే భక్తులు, వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తులు సమీపంలో ఉన్న శ్రీవారి సేవా సదన్ ఎదురుగా గల కౌంటర్లలో లగేజి, సెల్ఫోన్లు పొందే అవకాశముంది. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని టీటీడీ కోరుతోంది.
Next Story