Mon Dec 23 2024 16:25:56 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం చేయించడానికే ప్రాధాన్యత ఇస్తానని, ధనవంతుల సేవలో తరించేవాడిని
శుక్రవారం నాడు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి భక్తులు క్యూలైన్ వెలుపలకు వచ్చేశారు. స్వామివారి దర్శనానికి నేడు 18 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 57,443 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.9 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 28,198 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం చేయించడానికే ప్రాధాన్యత ఇస్తానని, ధనవంతుల సేవలో తరించేవాడిని కాదని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్రెడ్డి స్పష్టం చేశారు. ధనవంతులు, విఐపిలు దర్శనాల గురించి తాపత్రయపడితే స్వామివారి ఆశీస్సులు లభించవనే వాస్తవం గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గురువారం ఆయన అన్నమయ్య భవనంలో మీడియాతో మాట్లాడారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దయ, ఆశీస్సులతో ఊహించని విధంగా తనకు రెండవ సారి టీటీడీ చైర్మన్ గా పనిచేసే మహద్భాగ్యం దక్కిందన్నారు. ఇంతటి అదృష్టం ఇచ్చిన స్వామివారికి, మరోసారి పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 2006 నుండి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పని చేసిన సమయంలో ఒక వైపు సనాతన హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తూనే, సామాన్య భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అనేక నిర్ణయాలు తీసుకుని అమలు చేశామన్నారు. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించినట్టు చెప్పారు.
Next Story