Sat Nov 23 2024 03:41:20 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే.. నేడు ఈ టికెట్ల విడుదల
తిరుమల శ్రీవారి టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో
తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం నాడు కొనసాగుతోంది. నేడు టోకెన్ రహిత శ్రీవారి సర్వదర్శనం కోసం 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 87,792 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 4.20 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. అదే సమయంలో శ్రీవారికి 29,656 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు దాతలకు దర్శనం, గదులకు సంబంధించి అక్టోబరు కోటాను జూలై 24న ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటాను జూలై 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.
Next Story