Mon Dec 23 2024 12:14:49 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలకు వెళ్తున్నారా.. మీకిదే కీలక సూచన
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ బాగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూలైన్లు శిలాతోరణం వరకూ
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ బాగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూలైన్లు శిలాతోరణం వరకూ వ్యాపించాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 67,300 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చె్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.83 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 32,802 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకుంది. గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 సూక్ష్మ నమూనాతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.
Next Story