Mon Dec 23 2024 07:31:28 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు టోకెన్ రహిత శ్రీవారి
తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు టోకెన్ రహిత శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న 83,856 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.09 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 28,403 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరగనుంది. 80 అంశాలతో రూపొందించిన అజెండాలపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు చర్చించనున్నారు. టీటీడీ నూతన చైర్మన్గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డిని నియమించిన నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డికి ఇదే చివరి బోర్డు సమావేశం కానుంది. వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించబోతున్నారు భూమన. ప్రస్తుత ఛైర్మన్ సుబ్బారెడ్డి పదవీకాలం ఈ నెల 8న ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఛైర్మన్ ను ఎంపిక చేశారు సీఎం జగన్. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో టీటీడీ ఛైర్మన్ గా భూమన పని చేశారు. ఆ తర్వాత మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ ను భూమన కోరుతూ వచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గత నాలుగేళ్లుగా టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని కొనసాగించారు.
Next Story