Mon Dec 23 2024 14:54:28 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం 4.41 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. సోమవారం శ్రీవారిని79,087 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 35,640 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇక భక్తులు త్వరగా స్వామిని దర్శించుకునేందుకు టీటీడీ సరికొత్త ప్రయోగం సఫలమైంది. తిరుమల ఆలయం వెండి వాకిలి నుంచి సింగిల్ క్యూలైన్ విధానం పాటించడం ద్వారా ఎక్కువమంది భక్తులు సులభంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సరికొత్త విధానం వల్ల ఆదివారం రోజు రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగియనుండటంతో తిరుమలలో కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లలో స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఆ సమయంలో టీటీడీ సింగిల్ క్యూ లైన్ విధానాన్ని అమలు చేసి సక్సెస్ అయ్యింది. గత నాలుగేళ్లలో ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తలే అత్యధికం కావడం విశేషం. ఆదివారం నాడు ఏకంగా 92,238 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం క్యూలైన్ ద్వారానే 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్ మార్పులపై ఈవో ధర్మారెడ్డి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
Next Story