Mon Dec 23 2024 15:39:37 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే..?
తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. టోకెన్ రహిత శ్రీవారి సర్వదర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. టోకెన్ రహిత శ్రీవారి సర్వదర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం 87,967 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.20 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 32,083 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
జూన్ నెలలో హుండీ ఆదాయం వంద కోట్ల మార్కును దాటిందని టీటీడీ అధికారులు తెలిపారు. జూన్ 1నుంచి 30వ తేదీ వరకు 20,00,187 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో హుండీ ఆదాయం రూ.166.14 కోట్లు వచ్చింది. జూన్ 11వ న అత్యధికంగా 92,238 మంది, 10న 88,626 మంది, 17న 87,762 మంది, 25న 87,407 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జూన్ 18న అత్యధికంగా ఒక్కరోజే రూ.4.59 కోట్ల హుండీ ఆదాయం లభించిందని చెప్పారు. జూన్ మాసంలో మెుత్తం పదకొండు రోజుల పాటు రూ. 4 కోట్లకు పైగా హుండీ ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జనవరిలో రూ.123.07 కోట్లు, ఫిబ్రవరిలో రూ.114.29 కోట్లు, మార్చిలో 120.29 కోట్లు, ఏప్రిల్లో రూ.144.12 కోట్లు, మేలో రూ.109.99 కోట్లు హుండీ ఆదాయం లభించింది. ఈ ఏడాదిలోనే అత్యధికంగా జూన్ నెలలో రూ.166.14 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
Next Story