Fri Nov 22 2024 13:18:09 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శనివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఆలయం, మాడవీధులు, అన్నప్రసాదభవనం, లడ్డూకౌంటర్, అఖిలాండం, బస్టాండ్ ప్రాంతాలు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. శనివారం ఏడుకొండల వాడిని 87,762 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.61 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 43,753 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.
శనివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఆలయం, మాడవీధులు, అన్నప్రసాదభవనం, లడ్డూకౌంటర్, అఖిలాండం, బస్టాండ్ ప్రాంతాలు రద్దీగా మారాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్ శ్రీకృష్ణతేజ విశ్రాంతిభవనం వరకు వ్యాపించింది. టైంస్లాట్ టికెట్లు, టోకెన్లున్న భక్తులకు మూడు గంటల దర్శన సమయం పడుతోంది
అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తారు. 2020లో అధికమాసం వచ్చిన నేపథ్యంలో కొవిడ్ కారణంగా రెండు బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకాంతంగానే నిర్వహించింది. ఈ ఏడాది అధికమాసం రావడంతో రెండు బ్రహ్మోత్సవాలను భక్తుల మధ్య అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు.
Next Story