Mon Dec 23 2024 04:17:36 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలపైన హెలికాప్టర్లు చక్కర్లు
తిరుమల కొండపై వరసగా వివాదాల్లో చిక్కుకుంటుంది. నో ఫ్లైయింగ్ జోన్లో మూడు హెలికాప్టర్లు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది
తిరుమల కొండ వరసగా వివాదాల్లో చిక్కుకుంటుంది. నో ఫ్లైయింగ్ జోన్లో మూడు హెలికాప్టర్లు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కడప నుంచి ఈ హెలికాప్టర్లు తిరుమల మీదుగా వెళ్లినట్లు చెబుతున్నారు. తిరుమల కొండపైకి ఎలాంటి హెలికాప్టర్లు, డ్రోన్లు వంటి ఎగరడం నిషిద్ధం. ఇటీవల డ్రోన్తో తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయాన్ని కొందరు చిత్రకరించిన విషయం బయటపడిన సంగతి తెలిసిందే. అయితే ఇవి ఎయిర్ఫోర్స్కు చెందినవిగా ప్రాధమికంగా గుర్తించినట్లు తెలిసింది.
విచారణకు ఆదేశం...
తాజాగా హెలికాప్టర్లు మూడు వెళ్లడంతో దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్ అయింది. హెలికాప్టర్లకు ఎవరు అనుమతిచ్చారు? ఎలా ఇటు వైపు వెళ్లాయన్న దానిపై విచారణ కొనసాగిస్తున్నారు. అలా వెళ్లిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు హెచ్చరిస్తున్నారు. నో ఫ్లై జోన్ అమలులో ఉన్నా నిబంధనలను అతిక్రమించి కొండపై హెలికాప్టర్లు ఎగరడాన్ని భక్తులు కూడా తప్పు పడుతున్నారు.
Next Story