Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. కార్తీక మాసం సోమవారం కావడంతో?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కార్తీక సోమవారం కావడంతో భక్తులు అధికసంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కార్తీక సోమవారం కావడంతో భక్తులు అధికసంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. సాధారణంగా తిరుమలకు సోమవారం నుంచి గురువారం వరకూ భక్తుల సంఖ్య తిరుమలలో పెద్దగా ఉండదు. శుక్ర, శని, ఆదివారాలు మాత్రమే రద్దీ ఎక్కువగా ఉంది. అయితే కార్తీకమాసం సోమవారం కావడంతో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో రద్దీ పెరగడంతో వసతి గృహాలు కూడా దొరకడం దుర్లభంగా మారింది. వసతి గృహాల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. అదే సమయంలో అన్న ప్రసాద క్యాంటిన్ వద్ద కూడా భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. అదే సమయంలో క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలను, మజ్జిగలను కూడా అందచేస్తున్నారు. తిరుమలలో రద్దీ పెరగడంతో అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.