Tirumala : తిరుమలలో భక్తుల రద్దీతో అలెర్టయిన అధికారులు
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కొద్ది రోజులుగా భక్తుల రద్దీగా కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలలో గత కొద్ది రోజులుగా భక్తుల తాకిడితో రద్దీగా మారుతుంది. వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మాడ వీధులన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఇక తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం వద్ద కూడా ఉదయం నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు వసతి గృహాలు దొరకడం కూడా ఆలస్యమవుతుంది. గంటల పాటు వసతి గృహాల కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. దీంతో భక్తులు ఎక్కువ మంది వసతి గృహాల కోసమే ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు దృష్టికి రావడంతో సత్వరం చర్యలు ప్రారంభించారు. వరస సెలవులు రావడంతోనే భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. మరోవైపు కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తులు అధికంగా వస్తున్నారంటున్నారు. మొన్నటి వరకూ వర్షాలకు భయపడి కొంత రద్దీ తగ్గినా, మళ్లీ ఒక్కసారిగా తిరుమలకు భక్తుల తాకిడి పెరగడంతో అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.