Tirumala : తిరుమలలో నేడు ఫుల్లు రద్దీ... దర్శనం చేసుకోవాలంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. మాడవీధుల్లో భక్తుల సందడి కనపడుతుంది. గోవిందనామ స్మరణలతో తిరుమల వీధులు మారుమోగుతున్నాయి. భారీవర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో వారు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వర్షంలో తడుస్తూనే భక్తులు స్వామి వారి దర్శనం చేసుకుని స్వామి వారి ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వారు టిక్కెట్లను కొనుగోలు చేసిన వారు తిరుమలకు చేరుకోవడంతో పాటు రేపుశని వారం కూడా కావడంతో భక్తులు అధికంగానే ఉంటారని అధికారులు వేసుకున్న అంచనాలు నిజమయ్యాయి. జోరున వానలోనూభక్తులు తిరుమలకు చేరుకోవడంతో తిరుమల వీధులన్నీ కిక్కిరిసి పోయి ఉన్నాయి. తలనీలాలను సమర్పించే ప్రాంతాల్లోనూ, కోనేరు వద్ద కూడా భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. తిరుమల ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా ఎక్కువ రద్దీ కనిపిస్తుంది. దీంతో పాటు అన్నప్రసాదాల వద్ద కూడా భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ప్రసాదాలను స్వీకరించేందుకు క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు.