Sat Nov 23 2024 22:29:55 GMT+0000 (Coordinated Universal Time)
శనివారం.. తిరుమలలో భక్తుల రద్దీ ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి స్వామి వారి దర్శనం 16 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. రూ.300లు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
నేడు టీటీడీ పాలక మండలి....
నేడు తిరుమల, తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,518 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,416 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.44 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు.
Next Story