Sun Mar 23 2025 14:29:03 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భారీగా భక్తులు... దర్శనానికి ఎంత సమయం అంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారం నాడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. సహజంగా బుధవారం నాడు భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. అయితే ఈరోజు బుధవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే కనిపిస్తుంది. మహా కుంభమేళా ఎఫెక్ట్ తో కొద్దిపాటి సంఖ్యలో భక్తుల రద్దీ తగ్గినప్పటికీ మళ్లీ తిరిగి ప్రారంభమయింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తిరుమలలోని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నెలలో...
తిరుమలలో సాధారణంగా ఫిబ్రవరి నెలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. వివిధ పబ్లిక్ పరీక్షలు మార్చి ఏప్రిల్ నెలలో జరుగుతుండటంతో భక్తులు అధిక సంఖ్యలో ప్రతి సీజన్ లోనూ తక్కువగానే వస్తారు. దీంతో పాటు ఏ రోజు కారోజు ఎస్.ఎస్.డి. టోకెన్లు జారీ చేస్తుండటంతో ముందుగా బుక్ చేసుకోని వారు కూడా వచ్చి టోకెన్లు తీసుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ముందుగానే ప్రత్యేక దర్శనం టోకెన్లు పొందిన వారు కూడా వస్తుండంతో గత కొద్ది రోజులుగా తిరుమల వీధులన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి.
హుండీ ఆదాయం...
తిరుమలలో నేడు వైకుంఠం కాంప్లెక్స్ లోని ముప్ఫయి కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 67,192 మంది భక్తుల దర్శించుకున్నారు. వీరిలో 20,825 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.15 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం శ్రీవారి దర్శనానికి సమయం పడుతుంది.
Next Story