Mon Apr 14 2025 13:30:24 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలోనే తిరుమలకు చేరుకుంటున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలోనే తిరుమలకు చేరుకుంటున్నారు. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు తిరుమలకు చేరుకోవడంతో పాటు ఎస్.ఎస్.డి. టోకెన్లు రోజు జారీ చేస్తుండటంతో అప్పటికప్పుడు వచ్చే వారి భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తుంది. తిరుమలకు శనివారం నాడు ఎక్కువ మంది భక్తులు వస్తారని ముందుగానే అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. తిరుమలకు వచ్చే వారు ఎక్కువగా ఉండటంతో ఘాట్ రోడ్డులో కూడా వాహనాలు ఎక్కువగా కొండపైకి చేరుతున్నాయి.
రష్ తక్కువగా ఉంటే...
తిరుమల అంటేనే ఒక ఆధ్యాత్మిక కేంద్రం. అందులోనూ వెంకటేశ్వరస్వామి అందరికీ ఆరాధ్య దైవం. దేశ వ్యాప్తంగా నలుమూలల నుంచి తిరుమలకు వచ్చి భక్తులు శ్రీవారి వద్ద తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సీజన్ లో కొంత రద్దీ తక్కువగా ఉంటుంది. పరీక్షల సీజన్ కావడంతో ఎక్కువ మంది ఫిబ్రవరి, మార్చి నెలలో పెద్దగా తిరుమలకు రారన్నది అధికారుల అంచనా. సాధారణ రద్దీగానే ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో కంపార్ట్ మెంట్లలో ఖాళీ గా ఉన్నప్పుడు స్థానికులు ఎక్కువగా వచ్చి ఏడుకొండల వాడిని దర్శించుకుంటారు. చిత్తూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వస్తుంటారు.
21 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారిదర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేకదర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62,971 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,439 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.99 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story