Fri Nov 22 2024 21:26:30 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. క్యూలైన్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీకెండ్ తర్వాత వచ్చే కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారం కావడంతో స్వామి వారిని దర్శించుకుంటే పుణ్యం దక్కుతుందని ఎక్కువ మంది భావిస్తుంటారు. అందుకే తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
పన్నెండు గంటల సమయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పదమూడు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం స్వామి వారి దర్శనం పడుతుంది. సర్వదర్శనం క్యూ లైన్లో ఉన్న భక్తులు టోకెన్లు లేని వారికి పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమలను 70,350 మందిని శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి ఆదాయం 3.11 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది.
Next Story