Tiruamala : ఇదేమి రష్ బాబోయ్... ఈరోజు కూడా దర్శనం కష్టమేనా?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో దర్శనానికి గంటల తరబడి వేచి చూస్తున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో దర్శనానికి భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. క్యూ లైన్ లో గంటల తరబడి పిల్లా పాపలతో వేచి చూడాల్సి వస్తుంది. అయితే భక్తులు మాత్రం శ్రీవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. గత నాలుగు రోజుల నుంచి తిరుమలలో భక్తుల ర్దీ ఎక్కువగానే ఉంది. ఈరోజు తిరుమలలో శ్రీవారికి పౌర్ణమి గరుడ సేవ జరగనుంది. రాత్రి ఏడు గంటలకు గరుడ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి మాడ వీధుల్లో దర్శనమివ్వనున్నారు. దీంతో భక్తులు అందుకోసం కూడా తిరుమలకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని అధికారులు చెబుతున్నారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు ఉచితంగా అన్న ప్రసాదాలను, మంచినీటి సరఫరా చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.