Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శన సమయం?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఎంత మాత్రం తగ్గలేదు
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఎంత మాత్రం తగ్గలేదు. గత కొద్ది రోజులుగా భక్తుల రద్దీ తిరుమలలో కొనసాగుతూనే ఉంది. తిరుమలకు డిసెంబరు నెలలో ఎక్కువ మంది భక్తులు చేరుకుంటారు. తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఆపదమొక్కుల వాడిని దర్శించుకునేందుకు డిసెంబరు, జనవరి నెలలోనే ఎక్కువ మంది ఎంచుకుంటారు. మిగిలిన రోజుల్లో రద్దీ ఉన్నప్పటికీ ఈ నెలలో ఇంకొంత రద్దీ ఎక్కువగా ఉంటుంది. డిసెంబరు, జనవరి నెలల్లో హుండీ ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే కాదు.. కొన్నేళ్ల నుంచి ఇదే తరహా సంప్రదాయం కొనసాగుతుంది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో పాటు సెలవులు కూడా ఈ నెలలో ఎక్కువగా ఉండటంతో తిరుమలకు చేరుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎప్పటికప్పడు చర్యలు తీసుకుంటారు. దర్శనం త్వరగా పూర్తి అయ్యేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. క్యూ లైన్ లో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అన్న ప్రసాద కౌంటర్ వద్ద కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
పదకొండు కంపార్ట్ మెంట్లలో...
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now