Mon Dec 23 2024 13:55:58 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల కొండ భక్తులతో పోటెత్తింది. శ్రీవారి దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు కొండకు చేరుకున్నారు
తిరుమల కొండ భక్తులతో పోటెత్తింది. శ్రీవారి దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు కొండకు చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశినాడు స్వామి వారిని దర్శించుకుంటే మంచిదని భావించి ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుమలలో రద్దీ పెరిగింది. అర్ధరాత్రి 1.45 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది.
తొలుత వీఐపీలకు...
తొలుత 12.05 గంటలకు దర్శనాలను ప్రారంభించి ప్రముఖులకు దర్శనం కల్పించారు.తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మంత్రులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీ చరణ్, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, , సీని నటుడు రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, తెలంగాణ బీజేపి ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి దేవెగౌడ కుమారుడు రెవన్న గౌడ స్వామి వారిని దర్శించుకున్నారు.
హుండీ ఆదాయం...
నిన్న స్వామి వారిని53,101 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,843 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.48 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Next Story