Tue Nov 26 2024 11:27:25 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీవారి దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తులు రద్దీ అంతగా లేదు. పండగ కావడంతో భక్తులు తిరుమల కొండకు తక్కువ సంఖ్యలో చేరుకుంటున్నారు.
తిరుమలలో భక్తులు రద్దీ అంతగా లేదు. పండగ కావడంతో భక్తులు తిరుమల కొండకు తక్కువ సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో పెద్దగా తిరుమల కొండపై రష్ లేదు. కేవలం వైకుంఠం క్యా కాంప్లెక్స్ లోని ఒక కంపార్ట్మెంట్ లోనే భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి దర్శన సమయం కేవలం ఎనిమిది గంటల్లోనే లభిస్తుంది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఇప్పుడు ప్రవేశించే వారికి కొంత సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు రెండు గంటల్లోగా స్వామి వారి దర్శనం పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 59,090 భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. వీరిలో 21,054 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.37 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story