Mon Dec 23 2024 02:17:27 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు రద్దీ ఎక్కువగా ఉండటానికి కారణమిదే
తిరుమలలో రద్దీ ఎక్కువగానే ఉంది. నేడు కూడా భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంది
తిరుమలలో రద్దీ ఎక్కువగానే ఉంది. నేడు కూడా భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంది. గురువారమయినా భక్తుల రాక ఎక్కువ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వసతి గృహాలు కూడా దొరకడం భక్తులకు ఇబ్బందిగా మారింది. సహజంగా వీకెండ్ లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో పెళ్లిళ్లు, శుభకార్యాలయాలు తిరుమలలో చేసుకునేందుకు ఎక్కువ మంది వస్తుండటంతోనే రద్దీ ఎక్కువగా ఉంది.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 69,191 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 22,295 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పదమూడు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లో టోకెన్లు లేకుండా క్యూలైన్లోకి ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుంది.
Next Story