Fri Nov 22 2024 13:27:59 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 20 కంపార్టుమెంట్లలో
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 72,304 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 32,504 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఈ రోజు టీటీడీ విడుదల చేయనుంది. జూన్ 25వ తేదీన వసతి గదుల కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు.
తిరుమలలో అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద బాలుడిపై చిరుత దాడి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాత్రి ఏడు గంటల తర్వాత అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం నుండి 200 మంది భక్తులను ఒక బృందంగా కలిపి పంపించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. వీరితో పాటు సెక్యూరిటీ గార్డు ఉంటారని, భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ ముందుకు సాగుతారన్నారు. చిన్నపిల్లలు బృందంలో మధ్యలో ఉండేలా చూసుకొని ముందుకు వెళ్లనున్నారు. శ్రీవారి మెట్ల మార్గంలో సాయంత్రం ఆరు గంటల వరకు, అలిపిరి నడక మార్గంలో రాత్రి పది గంటల వరకు భక్తులను అనుమతిస్తారన్నారు. అయితే బాలుడిపై దాడి చేసిన చిరుతను పట్టుకోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story