Mon Dec 23 2024 12:50:32 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో మంగళవారం నాడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 20 కంపార్టుమెంట్లలో
తిరుమలలో మంగళవారం నాడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం 64,347 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.5.11 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 28,358 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణపై టీటీడీ దృష్టి పెట్టింది. ఈ మేరకు కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేసి, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. రెండు ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సీవీఎస్వో నరసింహ కిషోర్‌ను ఆదేశించారు. ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరిగినప్పుడు విజిలెన్స్ సిబ్బంది స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి అధికారులను అప్రమత్తం చేయాలన్నారు. ఎటువంటి ఆలస్యం లేకుండా క్షతగాత్రులకు చికిత్స చేయడానికి ఒక యాక్షన్ టీమ్ సిద్ధంగా ఉంటుందన్నారు. స్విమ్స్ వద్ద పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలన్నారు. ఘాట్ రోడ్లలో ప్రమాదకరమైన అవ్వచారికోన, కపిలతీర్థం పైభాగంలో మాల్వాడి గుండం దగ్గర రోలర్ పోస్టర్ బ్యారియర్ ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం అలిపిరి సమీపంలో పార్కింగ్ ప్రదేశాన్ని గుర్తించి వాహనాల పార్కింగ్, డ్రైవర్లను అందుబాటులో ఉంచేందుకు, తిరుమలలో ప్రీ పెయిడ్ టాక్సీ సేవలను అందించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్లలో ప్రమాదాలకు గురయ్యే వాహనాలను గుర్తించి రాకపోకలను నిషేధించడంతో పాటు, ఘాట్ రోడ్లలో నిఘా కోసం టీటీడీ సెక్యూరిటీ పోస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు.
Next Story