Fri Nov 22 2024 07:26:25 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో భక్తుల రద్దీ.. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 86,170 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ చెబుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 31,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయాల్లో జూలై 17న సోమవారం ఆణివార ఆస్థానం జరుగనుంది. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు, వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సాయంత్రం బంగారు వాకిలి వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నూతన వస్త్రాలను శ్రీ గోవిందరాజస్వామివారికి సమర్పిస్తారు. శ్రీ కోదండరామాలయంలో గరుడాళ్వార్ ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ఆణివార ఆస్థానం నిర్వహిస్తారు. ఆ తరువాత రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.
Next Story