Mon Dec 23 2024 16:31:15 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల శ్రీవారి దర్శనానికి ఎన్ని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారంటే?
జూన్ 22వ తేదీన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 77,120 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.39 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. స్వామివారికి 34,463 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది, భక్తులు, శ్రీవారి సేవకులకు 2 గంటల పాటు యోగలో శిక్షణను ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో చేపట్టారు.
జూన్ 22వ తేదీన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ, వర్చువల్ సేవ వంటి వాటికి సంబంధించిన దర్శనం టికెట్ల కోటాను జూన్ 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ. స్వామివారి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23న విడుదల చేయనుంది టీటీడీ. ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నట్లుగా టీటీడీ ప్రకటించింది. ఆగస్ట్ 27నుంచి 29వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్లను జూన్ 22వ తేది ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లుగా టీటీడీ పేర్కొంది.
Next Story