Mon Dec 23 2024 12:44:30 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్... తిరుమలలో వారికి నేటి నుంచి ప్రత్యేక దర్శనం
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు వికలాంగులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను నేడు విడుదల చేయనుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను నేటి నుంచి విడుదల చేయనుంది. ఏప్రిల్ నెల కోటా కింది రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున విడుదల చేయనుంది. ఈ టోకెన్ల ద్వారా వృద్ధులు, వికలాంగులు స్వామి వారిని సులువుగా ప్రత్యేక దర్శనం చేసుకునే వీలుంది.
రెండేళ్లుగా....
గత రెండు సంవత్సరాలుగా ఈ టోకెన్లను టీటీడీ నిలిపేసింది. కరోనా కారణంగా అన్ని ప్రత్యేక దర్శనం టిక్కెట్లను నిలిపేయడంతో వృద్ధులు, వికలాంగులు స్వామి వారి దర్శనం కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ ప్రత్యేక దర్శనం టోకెన్లను విడుదల చేయనుంది. ప్రతిరోజూ ఉదయం పది గంటలకు ఈ టోకెన్ల ద్వారా దివ్యాంగులు దర్శనం చేసుకోవచ్చు. ఒక్క శుక్రవారం మాత్రం మధ్యాహ్నం మూడు గంటలకు అనుమతిస్తారు.
Next Story