Mon Dec 23 2024 07:54:49 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
వీకెండ్ కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా
వీకెండ్ కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. శనివారం స్వామి వారిని 86,781 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి హుండీ ఆదాయం 3.47 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 44,920 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.
తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో శనివారం ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. తమిళనాడుకు చెందిన ఓ కుటుంబం శ్రీవారి దర్శనం ముగించుకుని శనివారం సాయంత్రం తిరుమల నుంచి కారులో తిరుగు ప్రయాణమైంది. వినాయకస్వామి ఆలయం దాటిన తర్వాత అలిపిరి చెక్‌పాయింట్ సమీపంలో మలుపు వద్ద కారు అదుపుతప్పి రోడ్డుకు కుడివైపున్న చిన్నపాటి కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
Next Story