Fri Nov 22 2024 23:24:28 GMT+0000 (Coordinated Universal Time)
వీకెండ్ లో తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ వెలుపలికి శ్రీవారి సర్వదర్శనానికిటోకెన్ లేని
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 69,483 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 32,459 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కు విశ్వ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో ఎస్వీబీసీ ద్వారా మరింత జనరంజక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్వీబీసీ 15వ వార్షికోత్సవం సందర్భంగా చెప్పారు. శుక్రవారం తిరుపతి లోని ఛానల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కరోనా కష్ట కాలంలో బయటకు వచ్చేందుకు భయపడుతున్న సమయంలో భక్తులను ఆకట్టుకునేలా కార్యక్రమాలను రూపొందించారని ప్రశంసించారు. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తుల నుంచి ఆదరణ లభించిందని స్పష్టం చేశారు. సుందరకాండ, భగవద్గీత లాంటి ఇతిహాసాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయని తెలిపారు చైర్మన్.ఎస్వీబీసీ యూట్యూబ్ , ఆన్ లైన్ రేడియోకు కూడా భక్తుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు . హిందీ, తమిళం, కన్నడ భాషలకు సంబంధించి ఆయా కేంద్రాల్లో స్టూడియోలు నిర్మాస్తామని.. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.
Next Story