Fri Nov 22 2024 19:21:26 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. నేడు స్వామి వారికి చక్రస్నానం చేయించారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. నేడు స్వామి వారికి చక్రస్నానం చేయించారు. బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తులకు ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా గరుడ వాహన సేవ రోజున భక్తులకు ఇక్కట్లు లేకుండా అన్ని సౌకర్యాలను కల్పించింది. నేడు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలుముగయినున్నాయి.
మూడు గంటలే...
బ్రహ్మోత్సవాలు ముగియనుండటం, మంగళవారం కావడంతో నేడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి సర్వదర్శనం క్యూ లైన్ లో వచ్చిన భక్తులకు మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 72,137 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.37 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story