Mon Dec 23 2024 17:24:38 GMT+0000 (Coordinated Universal Time)
రికార్డు స్థాయిలో శ్రీవారి ఆదాయం
గత రికార్డును తిరుమల శ్రీవారి హుండీ తిరగరాసింది. జులై నెలలో అత్యధికంగా భక్తులు తిరుమల కొండను దర్శించుకున్నారు.
గత రికార్డును తిరుమల శ్రీవారి హుండీ తిరగరాసింది. జులై నెలలో అత్యధికంగా భక్తులు తిరుమల కొండను దర్శించుకున్నారు. స్వామి వారికి కూడా అత్యధికంగా ఆదాయం లభించింది. హుండీ ద్వారా తిరుమల శ్రీవారికి జులై నెలలో 139.45 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమల చరిత్రలోనే ఇది రికార్డు అని చెబుతున్నారు. గతంలో ఒక నెలలో ఇంత ఆదాయం ఎప్పుడూ రాలేదని అధికారులు అంటున్నారు.
ప్రతి రోజూ...
జులై నెలలో ప్రతి రోజు నాలుగున్నర కోట్ల హుండీ ఆదాయం తగ్గలేదు. కరోనా తర్వాత భక్తులను పూర్తిస్థాయిలో అనుమతిచడంతో ఎప్పుడూ లేని విధంగా తిరుమల కొండకు భక్తుల జులై నెలలో పోటెత్తారు. అందుకే 139 కోట్ల ఆదాయం లభించింది. అంతకు ముందు ఇదే ఏడాది మార్చి 128 కోట్లు వచ్చింది. ఇదే అత్యధిక ఆదాయం అనుకుంటే జులై నెల మరింత పెరిగి రికార్డును సృష్టించింది. ఇక ఈ రికార్డును అధిగమించడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు.
Next Story