Mon Dec 23 2024 03:03:20 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో అక్టోబరు నెల హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయానికి ఎప్పుడూ కొరత లేదు. నిత్య హుండీ కానుకలతో కళకళలాడుతుంది
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయానికి ఎప్పుడూ కొరత లేదు. సామాన్య భక్తుల నుంచి ధనవంతుల వరకూ హుండీల్లో కానుకలు వేసి తమ మొక్కులు చెల్లించుకుని వెళుతుంటారు. ప్రతి రోజూ నిత్యకల్యాణం పచ్చ తోరణంలా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలలో ఎప్పుడో ఒకసారి తప్పించి భక్తుల రద్దీ తక్కువగా ఉండదు. దేశ వ్యాప్తంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు అధిక శాతం మంది భక్తులు రావడంతోనే నిత్యం కిటకిటలాడుతుంటుంది.
ప్రతి రోజూ హుండీలోనే...
దీంతో ప్రతిరోజూ తిరుమల హుండీ ఆదాయం నాలుగు కోట్ల రూపాయలకు తగ్గదు. శుక్ర, శని, ఆదివారాల్లో నాలుగున్నర కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయల వరకూ హుండీ ఆదాయం వస్తుంది. అదే సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో మాత్రం 3.50 కోట్ల ఆదాయం హుండీలో పడుతుంది. అయితే ఈసారి అక్టోబరు నెలలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 107.29 కోట్ల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. రానున్న నవంబరు, డిసెంబరు నెలల్లో ఆదాయం మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు వినిపడుతున్నాయి.
Next Story