Sat Dec 21 2024 14:54:32 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శ్రీవారి దర్శనం కోసం నవంబరు నెల కోటా ఆన్లైన్ లో విడుదల ఎప్పుడంటే?
నవంబరు నెల కోటాను ఆగస్టు 19న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు
నవంబరు నెల కోటాను ఆగస్టు 19న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగస్టు 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు ఆగస్టు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, నవంబరు 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవ టికెట్లను ఆగస్టు 22న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
ప్రత్యేక దర్శనం...
వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగష్టు 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.నవంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగష్టు 23న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన నవంబరు నెల ఆన్ లైన్ కోటాను ఆగష్టు 23న ఉదయం 11 గంటలకు తితిదే విడుదల చేయనుంది.వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘాకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత ప్రత్యేక ప్రవేశదర్శనం టోకెన్ల కోటాను ఆగష్టు 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
ఈ వెబ్ సైట్ ద్వారా...
నవంబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆగష్టు 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలో నవంబరు నెల గదుల కోటా ఆగష్టు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. తిరుమల, తిరుపతిలో శ్రీవారి సేవ కోటా ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు .https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని తితిదే విజ్ఞప్తి చేసింది
Next Story