Sun Dec 22 2024 17:23:50 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తిరుపతికి టిటిడి నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ గా నియమితులైన బీఆర్ నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ గా నియమితులైన బీఆర్ నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి స్వగ్రామం పెనుమూరు మండలం దిగువ పునేపల్లి గ్రామానికి వెళ్ళారు. టిటిడి నూతన ఛైర్మన్ కు నేండ్రగుంట, పూతలపట్టులో భారీ స్వాగత ఏర్పాట్లుచేశారు.
రాత్రికి తిరుమలలో బస...
మధ్యాహ్నం 12గంటల 15నిమిషాలు దిగువపూనేపల్లి గ్రామంలో ఆత్మీయులు, సన్నిహితులు , శ్రేయోభిలాషులతో మాట్లాడారు. అనంతరం బి.ఆర్. నాయుడు రోడ్డు మార్గం గుండా తిరుచానూరుకు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకుతిరుమలకుబయలుదేరివెళ్లనున్నారు. కపిలతీర్థం, అలిపిరి సర్కిల్లలో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. రాత్రికి తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేయనున్నారు. రేపు ఉదయం టిటిడి పాలకమండలి ఛైర్మన్ గా బాధ్యతల స్వీకరించనున్నారు.
Next Story