Sun Dec 22 2024 23:01:54 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : బ్రహ్మోత్సవాలకు తిరుమల శ్రీవారి ఆదాయం ఎంతంటే?
.శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు తెలిపారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు తెలిపారు. పదిహేను లక్షల మంది భక్తులకి వాహన సేవలను తిలకించేలా బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. 3.5 లక్షల మంది గరుడ సేవను వీక్షించారని చెప్పారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల పై భక్తుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఒక ప్రణాళిక బద్దంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను చేశామన్నారు. గత అనుభవాల దృష్టి ఉంచుకొని ఒక సూక్ష్మ ప్రణాళికను రూపొందించాంమని, ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించిన రోజున సూక్ష్మ ప్రణాళిక రూపొందించామని, సిఎం చంద్రబాబు కూడా తమకు కొన్ని సలహాలుచ్చారన్నారు.
ఆరు లక్షల మంది...
అన్ని విభాగాల అధికారుల సమన్వయం చేసుకొని భక్తులకు సంతృప్తికరంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో 4 లక్షల నీటి బాటిళ్లను సరఫరా చేశామని తెలిపారు. గరుడ సేవ రోజున ఆర్టీసీ బస్సుల ద్వారా 2800 ట్రిప్స్ ద్వారా భక్తులు తిరుమల చేరుకున్నారని తెలిపారు. ఆలయంలో నైవేద్యాలు 3.20 లక్షల మంది స్వీకరించారని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో 30 లక్షల లడ్డూలు విక్రయాలు జరిగాయని తెలిపారు. పారిశుద్ధ్యం కోసం ఎక్కువ సిబ్బందిని వాడుకొని పరిశుభ్రంగా తిరుమలను ఉంచామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో 6 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని, 26 కోట్లు హుండీ ద్వారా ఆదాయం వచ్చిందని తెలిపారు.
Next Story