Mon Dec 23 2024 08:17:42 GMT+0000 (Coordinated Universal Time)
Big News: తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ ఈవో ఏమన్నారంటే?
తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారయిన లడ్డూ నాసిరకంగా తయారయిందని ఈవో శ్యామలరావు తెలిపారు
తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారయిన లడ్డూ నాసిరకంగా తయారయిందని ఈవో శ్యామలరావు తెలిపారు. తాను బాధ్యతలను చేపట్టకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూలో జంతువుల నూనె వాడుతున్నారంటూ తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, దానిని సంస్కరించాలని చెప్పారన్నారు. అలాగే ఇక్కడ తిరుమలలోని పోటులో ప్రసాదం చేసే వారు కూడా నెయ్యిలో నాణ్యత లేదని చెప్పారన్నారు. నెయ్యి, నూనె అనే అనుమానాలు వచ్చాయన్నారు. సరఫరాదారులకు వార్నింగ్ ఇచ్చామని, నాణ్యత లేకుంటే వెంటనే సరఫరా చేసే కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని తెలిపామని ఈవో శ్యామల తెలిపారు. తక్కువ ధరకు నెయ్యి ఎలా సరఫరా చేశారన్న దానిపై అప్పుడే తమకు అనుమానం వచ్చిందన్నారు.
జంతువుల నెయ్యి కలిపారంటూ...
నెయ్యి నాణ్యత ఉండాలంటే ప్యూర్ నెయ్యి ఉండాలని శ్యామలరావు తెలిపారు. తమిళనాడుకు చెందిన ఏఆర్ సప్లయర్స్ నుంచి వచ్చిన జులై 24వ తేదీన సరఫరాచేసిన నెయ్యిలో నాణ్యత లేదన్నారు. కిలో 320 రూపాయలకు ఆ కంపెనీ నుంచి టీటీడీ కొనుగోలు చేసిందన్నారు. వాళ్లు సప్లయ్ చేసిన నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపామని, నమూనాలను బయట ల్యాబ్స్ కు పంపితే, ఎన్‌డీటీబీ ల్యాబ్ కు పంపామని తెలిపారు. ఈ ల్యాబ్ స్టాండర్డ్ కింద అందరూ తీసుకుంటారని అన్నారు. నాలుగు శాంపిల్స్ పంపితే ఈ నెల 23న రిపోర్టు వచ్చిందన్నారు. ఎస్ వాల్యూ టెస్ట్ తో పాటు 39 రకాల పరీక్షలు జరిపారన్నారు. వెజిటిబుల్ ఆయిల్ కలిసిందా? లేదని తెలుస్తుంది. ఎస్ వాల్యూ టెస్ట్ లో ఐదు రకాల పరీక్షలు చేస్తారన్నారు. ఎస్ వాల్యూ టెస్ట్ లో జంతువుల ఆయిల్ కలిసినట్లు తేలిందన్నారు.
Next Story