Sun Dec 22 2024 22:07:37 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : సీనియర్ సిటిజన్లకు నేరుగా శ్రీవారి దర్శనం.. కేవలం అరగంటలోనే
సీనియర్ సిటిజన్లకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది
సీనియర్ సిటిజన్లకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో రద్దీని దృష్టిలో ఉంచుకుని సీనియర్ సిటిజన్ల కోసం రెండు స్లాట్లను ఏర్పాటు చేసింది. ఒక స్లాట్ ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్లు నేరుగా స్వామి వారిని దర్శించుకోవచ్చు. అయతే సీనియర్ సిటిజన్లు ఫోటో గుర్తింపు కార్డుతో ఉన్న వయస్సు రుజువును సమర్పించాలని తెలిపింది. దీనిని S1 కౌంటర్లో సమర్పించాల్సి ఉంటుంది.సీనియర్ సిటిజన్లు ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా శ్రీవారిని దర్శించుకనే వీలు కల్పించింది. దీంతో పాటు కంపార్ట్మెంట్లలో అనువైన సీటింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు టీటీడీ తెలిపింది.
ఉచితంగా...
కంపార్ట్మెంట్ లో కూర్చున్నప్పుడు వేడి సాంబార్ అన్నం, పెరుగు అన్నంచ వేడి పాలు అందించనున్నట్లు తెలిపింది. ఇవన్నీ ఉచితంగానే భక్తులకు ఇస్తామని తెలిపింది. దీంతో పాటు ఇరవై రూపాయలు చెల్లించి చెల్లించి రెండు లడ్డూలను పొందవచ్చు. మరిన్ని లడ్డూల కోసం మీరు ప్రతి లడ్డూకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టెంపుల్ ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి, కౌంటర్ కౌంటర్ వరకూ సీనియర్ సిటిజన్లను డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులో ఉంటుంది. దర్శనం సమయంలో అన్ని ఇతర క్యూలు నిలిపివేయనున్నారు, ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్ దర్శనం మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. భగవంతుని దర్శనం తర్వాత సీినియర్ సిటిజన్లు 30 నిమిషాల్లోపు దర్శనం నుండి బయటకు రావచ్చు.
Next Story