Mon Dec 23 2024 07:21:04 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమల వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తలకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తలకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కాలినడకన వచ్చే భక్తులకు భద్రతపరంగా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం నుంచి వచ్చే భక్తులకు భద్రత కల్పించడంతో పాటు దర్శనంలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. దివ్య దర్శనం టోకెన్లు ద్వారా వారు సత్వరం స్వామి వారిని దర్శించుకునే వీలును ఇటీవల కల్పించిన సంగతి తెలిసిందే.
కాలినడకన వచ్చే...
కాలినడకన వచ్చే భక్తుల భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. చిరుత, ఎలుగుబంట్లు, ఏనుగులు వంటి వాటి బారిన భక్తులు పడకుండా భద్రతా చర్యలు పటిష్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాప్ కెమెరాలను అధికంగా ఏర్పాటు చేయాలని సూచించారు. జంతువుల కదలికలు కంట్రోల్ రూంకు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Next Story