Sun Dec 22 2024 22:15:27 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమల వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఈరోజు పది గంటలకే?
తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నేడు డిసెంబరు నెల కోటా దర్శన టిక్కెట్లను విడుదల చేయనుంది
తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు దేశ, విదేశాల నుంచి వస్తుంటారు. తిరుమల కొండ అందుకే నిత్యం భక్తులతో కిటకిటలాడిపోతుంటుంది. భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి ముందుగానే ప్లాన్ చేసుకునేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం నేడు దర్శన టిక్కెట్లను విడుదల చేయనుంది.
డిసెంబరు నెలకు సంబంధించి....
తిరుమలలో డిసెంబరు నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టిక్కెట్లను ఆన్లైన్ లో టీటీడీ ఉంచనుంది. ఈరోజు ఉదయం పది గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే కేవలం దర్శనం టిక్కెట్లు మాత్రమే కాదు వసతి గృహాలను కూడా ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో డిసెంబరు నెల దర్శన టిక్కెట్లు ఉంచగానే సెకండ్లలో పూర్తయ్యే అవకాశముంది. అందుకే డిసెంబరు నెలలో తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు ఈరోజు ఆన్లైన్ లో టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు.
Next Story